నీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించం : మేయర్ గుండు సుధారాణి

నీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించం : మేయర్ గుండు సుధారాణి

ఖిలా వరంగల్ (కరీమాబాదు), వెలుగు: నీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. శుక్రవారం ఉర్సు కరీమాబాద్ వాటర్ ట్యాంక్ ను ఆకస్మిక తనిఖీ చేసి, నీటి సరఫరాలో జాప్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏమైనా సమస్యలుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఏఈలు, ఇన్​స్పెక్టర్లను ఆదేశించారు.